Header Banner

"యథా నాయకుడు – తథా కార్యకర్తలు" అన్నట్లు పార్టీ మొత్తం దిక్కుమాలినది! వైసీపీ పై కీలక నేత ఫైర్!

  Wed Apr 09, 2025 12:02        Politics

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానాన్ని జగన్ పూర్తిగా కోల్పోయారని, ఆయన నేతృత్వంలో ఉన్న వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థితికి దిగజారిందన్నారు. "యథా నాయకుడు – తథా కార్యకర్తలు" అన్నట్లు పార్టీ మొత్తం దిక్కుమాలినదిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లింగమయ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరామని పేర్కొన్నారు. జగన్ తనకు మాజీ సీఎం అనే విజ్ఞత మరిచి బీసీలను దూషించారని ఆరోపించారు. బీసీలపై జగన్‌కు గౌరవం లేదని, ఓ బీసీ పోలీసు అధికారిని నోటికొచ్చినట్లు తిట్టిన తీరు దారుణమన్నారు. అదే అధికారి రెడ్డి వర్గానికి చెందినవాడైతే జగన్ అలా మాట్లాడేవాడా? అని ప్రశ్నించారు. బీసీ బిడ్డలుగా జగన్‌ను హెచ్చరిస్తున్నామని, ఒకవేళ ఆయన వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను సమీకరించి ఆయనపై రాజకీయ యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. క్షమాపణ లేకపోతే జగన్‌కు రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #JaganApologizeNow #RespectBCs #JusticeForBCs #KalvaVsJagan #BCsDemandJustice #PoliticalAccountability #YCPExposed #JaganMustAnswer